జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ స్క్వాడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఆసీస్ యువ కెరటం, ఐపీఎల్ సంచలనం ఫ్రేజర్ మెక్‌గుర్క్‌కు జట్టులో చోటు దక్కపోవడం షాకింగ్ కు గురి చేసింది. బ్యాటింగ్ ఆల్ రౌండర్ మ్యాట్ షార్ట్ ను సైతం పక్కన పెట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తాజాగా ఆస్ట్రేలియా బోర్డు వీరిద్దరిని ప్రపంచ కప్ జట్టులోకి ఎంపిక చేసింది.
15 మంది స్క్వాడ్ లో అవకాశం కల్పించకున్నా.. ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా మంగళవారం (మే 22) జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, మాట్ షార్ట్ ఆస్ట్రేలియా యొక్క ట్వంటీ 20 ప్రపంచ కప్ జట్టులో ఎంపిక చేశారు. టాప్ ఫామ్ లో ఉన్నవీరిద్దరూ ఆసీస్ జట్టులోకి చేరడంతో మరింత పటిష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మెక్‌గర్క్ దుమ్ము దులిపాడు. పవర్ ప్లే లో వీర విధ్వంసం సృష్టిస్తూ సంచలనంగా మారాడు. మరోవైపు షార్ట్ సంవత్సర కాలంగా ఆసీస్ టీ20 జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా మారాడు. కనీసం రిజర్వ్ ప్లేయర్లుగా సెలక్ట్ చేసి న్యాయం చేశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టులో స్టీవెన్ స్మిత్‌ను పక్కనపెట్టారు. అవకాశం దక్కుతుందని ఆశించిన జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్‌లెట్‌నూ తప్పించారు. జూన్ 1 నుంచి జూన్ 29 వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుంది. మొత్తం 20 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్‌లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు.
ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ జట్టు:
మిచెల్ మార్ష్ (కేప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్స్ :
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, మాట్ షార్ట్
#ICYMI: Cricket Australia have named Jake Fraser-McGurk and Matt Short as traveling reserves for the Australian cricket team for the T20 World Cup 2024. pic.twitter.com/TXFQxY8LIu
— OneCricket (@OneCricketApp) May 21, 2024