DC vs SRH: క్యాచ్‌తో సన్ రైజర్స్‌కు పెద్ద షాకిచ్చాడు: బౌండరీ దగ్గర ఆసీస్ క్రికెటర్ విన్యాసం

DC vs SRH: క్యాచ్‌తో సన్ రైజర్స్‌కు పెద్ద షాకిచ్చాడు: బౌండరీ దగ్గర ఆసీస్ క్రికెటర్ విన్యాసం

టీ20 లీగ్ లు ఎక్కువైన తరుణంలో ఒక్క క్యాచ్ మ్యాచ్ ని డిసైడ్ చేసేస్తోంది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ మీదే కాదు ఫీల్డింగ్ మీద కూడా ప్లేయర్లు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నమ్మశక్యం కానీ రీతిలో క్యాచులు అందుకుంటూ అభిమానులని థ్రిల్ కి గురి చేశారు. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ లాంటి మెగా టోర్నీలో ఒకదానికి మించి మరో క్యాచ్ ని అందుకుంటూ ఆడియన్స్ కి కిక్ ఇస్తోనే ఉన్నారు. తాజాగా అలాంటి క్యాచ్ ఒకటి ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో నమోదయింది.

విశాఖ పట్నం వేదికగా ఆదివారం (మార్చి 30) ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తుంది. ఇన్నింగ్స్ చివర్లో ఆస్ట్రేలియా జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ పట్టిన ఒక స్టన్నింగ్ క్యాచ్ సన్ రైజర్స్ జట్టును భారీ స్కోర్ కొట్టకుండా ఆపింది. ఇన్నింగ్స్ 16 ఓవర్ ఐదో బంతిని అనికేత్ డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. ఈ బాల్ సిక్సర్ అనుకుంటున్నా సమయంలో సూపర్ మ్యాన్ తరహాలో ఫ్రేజర్-మెక్‌గుర్క్ గాల్లోకి అమాంతం ఎగిరి రెప్పపాటులో క్యాచ్ అందుకున్నాడు. 

ఈ వికెట్ కోల్పోవడం సన్ రైజర్స్ కు చాలా మైనస్ అయింది. అప్పటివరకు సూపర్ బ్యాటింగ్ తో అదరగొడుతున్న అనికేత్ 40 బంతుల్లో 74 పరుగులు చేసి దూకుడు మీదున్నాడు. అతను చివరి వరకు క్రీజ్ లో ఉండి ఉంటే హైదరాబాద్ 180 పరుగులకు పైగా స్కోర్ చేసింది. కానీ కీలక సమయంలో ఈ క్యాచ్ జట్టుపై చాలా ప్రభావం చూపించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయింది. యువ బ్యాటర్ అనికేత్ వర్మ (41 బంతుల్లో 74: 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మినహాయిస్తే మిగిలిన వారు కనీస ప్రదర్శన కూడా చేయలేకపోయారు.