ఐపీఎల్ లో బౌలర్ల కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ముంబై బౌలర్లపై దారుణంగా విరుచుకుపడుతున్నారు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ముంబై బౌలర్ల భరతం పడుతున్నాడు. ఈ సీజన్ లో అద్భుత ఫామ్ లో ఉన్న ఈ ఆసీస్ కుర్రాడు.. నేటి మ్యాచ్ లో మరింతగా చెలరేగుతున్నాడు. 8 ఫోర్లు, 3 సిక్సులతో వీర విధ్వంసం సృష్టించాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి మెక్‌గుర్క్ తొలి బంతి నుంచే తన దూకుడిని కొనసాగించాడు. తొలి మూడు బంతులను వరుసగా 4,4,6 కొట్టి 19 పరుగులు రాబట్టాడు. ఇతని ధాటికి ఢిల్లీ జట్టు పవర్ ప్లే లో ఏకంగా 92 పరుగులు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ ముంబైపై 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 113 పరుగులు చేసింది. క్రీజ్ లో ఫ్రేజర్-మెక్‌గుర్క్ 25 బంతుల్లో 83, అభిషేక్ పోరెల్ (27) ఉన్నారు.
22 YEAR OLD JAKE FRASER-MCGURK GETS A STANDING OVATION FROM DELHI CROWD. 👏💯 pic.twitter.com/1Ax17Cd4q4
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 27, 2024