మైక్ టైసన్‌ను మట్టికరిపించిన యూట్యూబర్‌.. రూ. 338 కోట్లు సంపాదన

మైక్ టైసన్‌ను మట్టికరిపించిన యూట్యూబర్‌.. రూ. 338 కోట్లు సంపాదన

దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్‌(58)కు ఊహించని ఓటమి ఎదురైంది. 27 ఏళ్ల బాక్సర్/ యూట్యూబర్ జేక్ పాల్ చేతిలో అతను పరాజయం పాలయ్యాడు. తాజాగా, టెక్సాస్‌ వేదికగా ఈ ఇద్దరి మధ్య ఫైట్ జరిగింది. ఈ పోరులో జేక్ పాల్‌ 78-74 తేడాతో టైసన్‌పై విజయం సాధించాడు. తద్వారా అతను ఆర్జించిన మొత్తం.. అక్షరాలా రూ. 338 కోట్లు. టైసన్‌ను ఓడించడం ద్వారా పాల్‌ 40 మిలియన్ డాలర్లు ఆర్జించినట్లు ఓ నివేదిక పేర్కొంది. 

మునుపటి ఉత్సాహం లేదు 

దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ప్రొఫెషనల్‌ రింగ్‌లోకి అడుగుపెట్టిన టైసన్‌ మునుపటి ఉత్సాహం చూపించలేకపోయాడు. మొదటి రెండు రౌండ్లలో ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, చివరివరకూ దానిని కొనసాగించలేకపోయాడు. మూడో రౌండ్‌ నుంచి జేక్ పాల్ పంచులు వర్షం కురిపించాడు. పాల్ ఓవర్‌హ్యాండ్ పంచ్‌లతో టైసన్ స్టామినా దెబ్బతినడంతో, అతని ముందు నిలబడలేకపోయాడు. చివరకు ఎనిమిదో రౌండ్‌లో ఓటమిని అంగీకరించాడు.

Also Read : ఐపీఎల్ మెగా వేలంలో 13 ఏళ్ల పోరగాడు

2005లో టైసన్‌ ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ బౌట్‌లో తలపడటం కోసం మరోసారి రింగ్‌లో అడుగుపెట్టారు. ఈ ఫైట్ ద్వారా టైసన్‌‌కు సుమారు రూ.168 కోట్ల మొత్తం అందినట్లు తెలుస్తోంది. ఓటమి అనంతరం టైసన్‌.. తన ప్రత్యర్థి జేక్ పాల్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. పాల్ నిష్ణాతుడైన పోరాట యోధుడని కొనియాడాడు.