ఎమ్మెల్యే వినోద్​కు రుణపడి ఉంటానన్న జక్కుల శ్వేత

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​కు రుణపడి ఉంటానని బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత చెప్పారు. తనపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు కాంగ్రెస్​కౌన్సిలర్లతో కలిసి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఎమ్మెల్యే వినోద్ చేసిన కృషి మరువలేనిదన్నారు. బీఆర్ఎస్​ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టారన్నారు. అలాగే అవిశ్వాసం వీగిపోవడంతో బెల్లంపల్లి  కాంగ్రెస్ లీడర్లు హర్షం వ్యక్తం చేశారు.