Ranji Trophy 2023-24: ఒక్కడే 9 వికెట్లు..సంచలనం సృష్టించిన జలజ్ సక్సేనా

Ranji Trophy 2023-24: ఒక్కడే 9 వికెట్లు..సంచలనం సృష్టించిన జలజ్ సక్సేనా

వెటరన్ ఆఫ్ స్పిన్నర్ జలజ్ సక్సేనా తన స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు. ఒక్కడే 9 వికెట్లు తీసి రంజీ ట్రోఫీలో సంచలన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. నేడు (ఫిబ్రవరి 11) జరిగిన తిరువనంతపురంలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ గ్రౌండ్‌లో బెంగాల్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో కేరళ తరపున ఈ గణాంకాలను నమోదు చేశాడు. దీంతో రంజీ ట్రోఫీలో కేరళ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో రెండవ అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

1971 లో కన్నూర్‌లో ఆంధ్రాపై అమర్‌జిత్ సింగ్ 45 పరుగులిచ్చి 9 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటివరకు కేరళ రంజీ చరిత్రలో ఇదే బెస్ట్ బౌలింగ్ స్పెల్. ఈ మ్యాచ్ లో సక్సేనా 63 పరుగులిచ్చి 9 వికెలు తీసుకొని రెండో స్థానంలో నిలిచాడు. మిగిలిన ఒక వికెట్ ను నిదీష్ తీసుకున్నాడు. ఈ సీనియర్ స్పిన్నర్ ధాటికి బెంగాల్ తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆలౌటైంది. అంతకముందు కేరళ తొలి ఇన్నింగ్స్ లో 363 పరుగులు చేసింది. దీంతో కేరళకు 163 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. క్రీజ్ లో శ్రేయాస్ గోపాల్ (14), మహమ్మద్ అజారుద్దీన్ (11) ఉన్నారు. సచిన్ బేబీ (51), రోహన్ కున్నముల్ (51) హాఫ్ సెంచరీలు చేశారు. షాబాజ్ అహ్మద్ కు రెండు వికెట్లు దక్కాయి.           

మరిన్ని వార్తలు