ప్రతిపాదనల దశలోనే నిలిచిపోయిన జలవిహార్ ప్రాజెక్టు

నిర్మల్, వెలుగు:  బాసర సరస్వతిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికులను ఆకట్టుకునేందుకు ఎస్సారెస్పీ, బాసర జల విహార్​ ప్రాజెక్టు ప్రతిపాదనల దశలోనే నిలిచిపోయింది. కరోనా తగ్గాక రాష్ట్రం లోని వివిధ నదీతీర ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు బోటింగ్​ ఫెసిలిటి కల్పించాలని అధికారులు ప్రతిపాధించారు. ఇందులో భాగంగానే కొన్ని నది తీర ప్రాంతాల్లో బోటు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పటికీ బాసర వద్ద మాత్రం ఇప్పటివరకు ఆ సౌకర్యాన్ని  కల్పించలేకపోతున్నారు. 

బాసరకు ప్రతిరోజు మన రాష్ట్రం  నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల  నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా ప్రతి శుక్రవారంతో  పాటు పండుగ రోజున  అమ్మవారిని దర్శిం చేందుకు భక్తులు బారులు తీరుతారు. ఇక్కడ భక్తులకు వసతి సౌకర్యం ఉండటంతో.. ఒకరోజు గడిపి మరుసటి రోజు  మొక్కులు తీర్చు కుం టారు.   దర్శనం తర్వాత  వీరికకి గోదావరిలో బోటింగ్​  సౌకర్యం కల్పిస్తే ఇటు టూరిజం శాఖకు ఆదాయం, అలాగే భక్తులకు ఆహ్లాదం ఉంటుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. 

కాగితాలకే పరిమితమైన ప్రతిపాదన...

బాసర నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ రిజర్వాయర్ వరకు బోట్లు నడపాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం శంకు స్థాపనకు గతం లో పోచంపాడు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ అంశా న్ని ప్రస్తావించారు. పథకం పూర్తయితే కాళేశ్వరం జలాలతో ఎస్సారెస్సీ నిండాక బాసర , ఎస్సారెస్పీ మధ్య పడవలో ప్రయాణించవచ్చని సీఎం అప్పట్లో పేర్కొ న్నారు. ఈ నేపథ్యంలో సాగునీటి, పర్యాటక శాఖ అధికారులు ఇక్కడ బోటింగ్​పై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే 2019లో కసరత్తు ప్రారం భించి ట్రయల్ రన్ కూడా చేపట్టారు. త్వరలో సర్వీసులు ప్రారంభిస్తామని పర్యాటకశాఖ చెప్పి రెండేళ్లయింది. కానీ, ఇప్పటి వరకూ ఆదిశగా అడుగులు పడలేదు. 

భక్తులకు నిరాశే..

బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మరింత ఆహ్లాదం, మధురానుభూతిని పొందేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ సాకారమైతే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎస్సారెస్పీ చేరుకుని అక్కడి నుంచి బాసరకు బాసర నుంచి తిరిగి శ్రీరాంసాగర్ కు పడవల ద్వారా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఎస్సారెస్పీని అనుకుని ఉన్న నిజా మాబాద్ జిల్లాలోని బస్వాపూర్, నాగాపూర్ గ్రామాల దగ్గర బోటింగ్ పాయింట్ లు ఏర్పాటు చేసి బాసర వరకు పడవలను నడపాలని గతంలో అధికారులు సూ త్రప్రా యంగా నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు సీరియస్ యాక్షన్ మొదలు కాలేదు

 అవకాశాలు అనేకం.....

పర్యాటకశాఖ, దేవాదాయ శాఖలు సంయుక్తంగా ప్రాజెక్టుపై కార్యాచరణ మొదలుపెట్టాలని స్థానికులు, భక్తులు  కోరుతున్నారు. గోదావరి లో బోటు ప్రయా ణాలను షురూ చేస్తే ఎస్సారెస్పీ  నుంచి బాసర, బాసర  నుంచి ఎస్సారెస్పీ వరకు రెండున్నర గంటల వ్యవధిలో గమ్యం చేరుకోవచ్చంటున్నారు. సుమారు 60 కిలోమీటర్ల మేర ఈ ప్రయాణం సాగుతుందని మధ్యలో బ్రహ్మేశ్వరం ఆలయ సందర్శన, ఉమ్మెడ తదితర పర్యాటక ప్రాంతాల వద్ద బోట్లు నిలిపినా మూడు గంటల్లో బాసర చేరుకోవచ్చంటున్నారు. వేసవి మినహా మిగతా ఎనిమిది నెలల పాటు పడవలను నడిపే ఆకాశముంటుందంటున్నారు.