విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. విజయవాడ పశ్చిమ టికెట్ జలీల్ ఖాన్ కే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆయన కాన్వాయ్ ని అడ్డుకున్నారు మైనార్టీ నేతలు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్ టీడీపీ వర్క్ షాప్ జరుగుతున్న సమయంలో ఈ నిరసన తెలియజేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడ పశ్చిమ టికెట్ గద్దె రామ్మోహన్ కి కానీ, పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కానీ కేటాయించే అవకాశం ఉందని వార్తలొస్తున్న నేపథ్యంలో జలీల్ ఖాన్ అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది.
2024 ఎన్నికల అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత అసమ్మతి పీక్స్ కి చేరిన నేపథ్యంలో ఇప్పుడు జలీల్ ఖాన్ వర్గం నుండి నిరసన సెగ రాజుకోవటం చంద్రబాబుకు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది.కాగా, విజయవాడలో ఏర్పాటు చేసిన టీడీపీ వర్క్ షాప్ కి సీనియర్ నాయకులూ దేవినేని ఉమా, గంటా శ్రీనివాస్, కళా వెంకటరావు, ఆలపాటి రాజా వంటి సీటు దక్కని నేతలు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలోనే వీరిలో కొంతమంది త్వరలోనే పార్టీని వీడే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి.