మొదలైపోయిన జల్లికట్టు.. చిత్తూరు జిల్లా పల్లెల్లో సంబురంగా..

మొదలైపోయిన జల్లికట్టు.. చిత్తూరు జిల్లా పల్లెల్లో సంబురంగా..

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు  జిల్లాలో జల్లికట్టు సంబరాలు ప్రారంభం అయ్యాయి. ఈ సంబరాలు నెల రోజుల పాటు రోజుకో గ్రామంలో జరగనున్నాయి. కాగా ఈ సంబరాలకు నిర్వాహకులతో పాటు స్థానిక అధికారులు, పోలీసులు, ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు .తమిళనాడు సంస్కృతి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కు పాకుతుంది.  ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు ముందు తమిళరాడెలో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు. అయితే ప్రతి ఏడాది ఈ పోటీల చుట్టూ వివాదం జరుగుతుంది. 

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్తశానంబట్లలో  పశువుల పండుగ(జల్లికట్టు)  నిర్వహించారు. పరిసరాల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పశువులను తీసుకొచ్చారు. వీటికి కొమ్ములు చెలిగి, రంగులు వేసి కొప్పులను తొడిగారు. నాయకులు, సినీనటులు, దేవుళ్ల ఫొటోలతో అలంకరించారు. రంగు కాగితాలు అంటించిన చెక్క పలకలతో పాటు, నగదు, దుస్తుల, విలువైన వస్తు సామగ్రిని కట్టారు.

గ్రామ నడివీధిలో పశువులను గుంపులుగా వదిలారు.  వేలాది మంది యువకులు అల్లె అవతల నిలబడ్డారు. కోడెగిత్తలను నిలువరించేందుకు పోటీపడ్డారు. చెక్కపలకలను చేజిక్కించుకోవడంలో యువకుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. కొందరు కింద పడటంతో పదిమందికిపైగా తీవ్రగాయాలు కాగా.. . మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. చెక్క పలకలను చేజిక్కించుకున్న యువకులు ఉత్సహంగా కేరింతలు కొట్టారు. పశువుల పండగను తిలకించడానికి వచ్చిన వారందరికీ గ్రామస్తులు భోజనం, తాగునీటి సౌకర్యం కల్పించారు...