ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కు టెస్ట్ క్రికెట్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. టెస్ట్ క్రికెట్ లో కి అడుగుపెట్టి 22 సంవత్సరాలు గడిచినా.. తనలోని పదును ఇంకా తగ్గలేదని నిరూపిస్తున్నాడు. నాలుగు పదుల వయసులోనూ కుర్రాళ్లకు ఏ మాత్రం తగ్గడం లేదు. రెండు దశాబ్దాలకు పైగా ఎన్నో ఘనతలు సాధించిన ఈ పేసర్.. తాజాగా టెస్ట్ క్రికెట్ లో 700 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ధర్మశాల వేదికగా జరుగుతున్న టెస్టులో మూడో రోజు ఆటలో భాగంగా.. ఓవర్‌నైట్ బ్యాటర్ కుల్దీప్ యాదవ్ ను ఔట్ చేయడంతో అండర్సన్ ఈ ఘనతను అందుకున్నాడు.
ఓవరాల్ గా టెస్టుల్లో 700 వికెట్లు సాధించిన మూడో బౌలర్ గా అండర్సన్ నిలిచాడు. అంతక ముందు శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (800), ఆస్ట్రేలియా దివంగత షేన్ వార్న్ (708 వికెట్లు) ఈ లిస్ట్ లో ఉన్నారు. ఒక ఫాస్ట్ బౌలర్ గా ఈ ఫీట్ అందుకున్న తొలి బౌలర్ గా అండర్సన్ రికార్డుల్లో నిలిచాడు. టెస్టుల్లో స్వింగ్ కింగ్ గా పేరొందిన ఈ ఇంగ్లీష్ పేసర్ 2003లో జింబాబ్వేతో లార్డ్స్‌లో తన మొదటి మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు 187 టెస్టుల్లో 27 యావరేజ్ తో మొత్తం 32 సార్లు 5 వికెట్లను పడగొట్టాడు.
The first ever pacer in test cricket history to have take 700 test wickets, No one can match you Jimmy.
— urstrulyManish (@CallMeSSMBFan) March 9, 2024
Anderson is just unbelievable ❤️🐐 @jimmy9💥#JimmyAnderson#JamesAnderson pic.twitter.com/HeoaznhEno
ప్రస్తుత క్రికెటర్లలో అండర్సన్ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ (527), భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (511) ఉన్నారు. భారత్ తో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ లో అండర్సన్ కు చోటు దక్కలేదు. ఆ తర్వాత ఆడిన నాలుగు టెస్టుల్లో 33 యావరేజ్ తో 10 వికెట్లను పడగొట్టాడు. మరో 14 టెస్టులాడితే ఈ ఫార్మాట్ లో అత్యధిక మ్యాచ్ లాడిన ప్లేయర్ గా ఈ ఇంగ్లీష్ పేసర్ ఆల్ టైం రికార్డ్ సృష్టిస్తాడు. మరి టెస్టుల్లో అండర్సన్ హవా ఎప్పటివకు కొనసాగుతుందో చూడాలి.
James Anderson - the first pacer to get to 700 Test wickets 💥🔥#INDvENG pic.twitter.com/wBVPtGyJaB
— Cricbuzz (@cricbuzz) March 9, 2024