ENG v WI 2024: నిన్నటిదాకా ప్లేయర్.. నేడు మెంటార్: అండర్సన్ కొత్త అవతారం

ENG v WI 2024: నిన్నటిదాకా ప్లేయర్.. నేడు మెంటార్: అండర్సన్ కొత్త అవతారం

ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ 21 ఏళ్ళ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ తో లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు అండర్సన్ కెరీర్ లో చివరిది. రిటైర్మెంట్ తర్వాత ఈ ఇంగ్లీష్ పేసర్ జట్టుతోనే ఉండనున్నాడు. ఈ దిగ్గజ పేసర్ కు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మెంటార్ గా బాధ్యతలు అప్పగించారు. దీని ప్రకారం వెస్టిండీస్ తో జరగబోయే చివరి రెండు టెస్టులకు అండర్సన్ ఇంగ్లాండ్ బౌలింగ్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.    

ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ ఈ సిరీస్ కు ముందే సోమవారం (జూలై 2) అండర్సన్ జట్టుతోనే కొనసాగుతారని.. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ మెంటార్ గా కొత్త పాత్రలో కనిపిస్తారని తెలియజేశాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్ తో ఇంగ్లాండ్ గురువారం (జూలై 18) నుంచి రెండో టెస్ట్ జరగనుంది. ఈ టెస్టుకు ఇప్పటికే ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ప్రకటించారు. ఫాస్ట్ బౌలర్ అండర్సన్ తొలి టెస్ట్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో మార్క్ వుడ్ కు తుది జట్టులో స్థానం దక్కింది. మరో ఇద్దరు పేసర్లుగా క్రిస్ వోక్స్, గుట్కిన్సన్ ఉన్నారు.  

Also Read :- మిషన్ పారిస్ ఒలింపిక్స్‌

సొంతగడ్డపై వేలాది ప్రేక్షకుల మధ్య చప్పట్లతో అండర్సన్ వీడ్కోలు గ్రాండ్ గా జరిగాయి. తన చివరి టెస్టు లో ఈ ఫాస్ట్ బౌలర్ 4 వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీసుకున్న జిమ్మీ.. రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్ట్ కెరీర్ లో 704 వికెట్లతో తన కెరీర్ ను ముగించాడు. ఇప్పటికే ఈ దిగ్గజ బౌలర్ వన్డే, టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2002 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అండర్సన్ ఇప్పటివరకు 188 టెస్టుల్లో 704 వికెట్లు పడగొట్టాడు. 194 వన్డేల్లో 269, 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు.      

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)