ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లాండ్ టూర్ లో వెస్టిండీస్ మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా బుధవారం (జూలై 10) లార్డ్స్ వేదికగా మొదటి టెస్ట్ జరగనుంది. ఈ టెస్ట్ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అండర్సన్ కు కెరీర్ లో చివరిది. దీంతో మ్యాచ్ కు ముందు ఈ ఇంగ్లీష్ సీమర్ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటికే టీ20, వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అండర్సన్ నేడు తన చివరి టెస్ట్ ఆడి అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు.
కెరీర్ లో 188 టెస్టు మ్యాచ్ లాడిన అండర్సన్.. సచిన్ తర్వాత అత్యధిక టెస్ట్ మ్యాచ్ లాడిన ప్లేయర్ గా నిలిచాడు. ఇక వికెట్ల విషయానికి వస్తే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల లిస్టులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అగ్ర స్థానంలో శ్రీలంక స్పిన్నర్ మురళీ ధరన్ (800) ఉన్నాడు. షేన్ వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 700 వికెట్లు తీసిన అండర్సన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. నేడు వెస్టిండీస్ తో జరగబోయే టెస్టులో అండర్సన్ 9 వికెట్లు తీస్తే టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో వార్న్ ను అధిగమించి రెండో స్థానానికి చేరుకుంటాడు.
2025-2026 యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాలో జరగనుంది. ఆ సమయానికి అండర్సన్ ఫిట్ నెస్ పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తోందట. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ టెస్టు జట్టు హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్.. అండర్సన్‌కు వివరించగా.. ఈ దిగ్గజ పేసర్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. 2022 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అండర్సన్ ఇప్పటివరకు 187 టెస్టుల్లో 700 వికెట్లు పడగొట్టాడు. 194 వన్డేల్లో 269, 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు.
James Anderson prepares for his last bow in international cricket 💫#WTC25 | #ENGvWI pic.twitter.com/TmoPCzAsFs
— ICC (@ICC) July 9, 2024