ఇంగ్లాండ్ క్రికెటర్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

ఇంగ్లాండ్ క్రికెటర్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

సౌతాంప్టన్‌లో ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ విన్స్ ఇంటిపై దుండగులు దాడి చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన షాకింగ్ కు గురి చేస్తుంది. విన్స్ అతని కుటుంబంతో సౌతాంప్టన్ లో ఎనిమిది సంవత్సరాలుగా ఉంటున్నాడు. గతంలో అతనికి ఎప్పుడూ ఇలాంటి సంఘటన ఎదురు కాలేదు. అయితే, కొన్ని నెలల గ్యాప్ లో గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంటిపై రెండుసార్లు  దాడి చేయడంతో ఈ ఇంగ్లీష్ క్రికెటర్ పిల్లల భద్రత కోసం సౌతాంప్టన్‌లోని అతని స్వస్థలాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది.

Also Read:-క్రికెటర్‌ను భార్య ఎదుటే కాల్చి చంపిన దుండగులు

దుండగులు రెండుసార్లు దాడి చేయడంతో తన కుటుంబం అనుభవించిన కష్టాల గురించి ఇంగ్లండ్ క్రికెటర్ జేమ్స్ విన్స్ వెల్లడించాడు. టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ.. నేను నా భార్య అర్ధరాత్రి గ్లాస్ పగులగొట్టే శబ్దం విన్నాం. అలారంలు మోగడం వల్ల అకస్మాత్తుగా మేల్కొన్నాము. ఏమి జరుగుతుందో మాకు తెలియదు. మా పిల్లలు సురక్షితంగా ఉన్నారో లేదో అని మేము వారి దగ్గరకు పరిగెత్తాము. ఈ సంఘటనతో భయానికి గురయ్యాను. దాడి గురించి తెలియజేయడానికి పోలీసులను సంప్రదించాను". అని విన్సీ తెలిపాడు. 

ఈ ఘటన తర్వాత మే 11 నుండి CCTV వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్కడ ఒక దుండగుడు విన్సీ ఇంటిపై రాళ్లు రువ్వడం.. కిటికీలు పగలగొట్టడం కనిపించింది. ఆ గుర్తు తెలియని వ్యక్తి తెల్లటి చొక్కా ధరించి తన ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచాడు. విన్సీ కుటుంబంపై మొదటిసారి ఏప్రిల్ 15న దాడి జరిగింది. దుండగుల గురించి సమాచారం అందితే హాంప్‌షైర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని ఇంగ్లాండ్ క్రికెటర్ అభిమానులను కోరాడు. ఇంగ్లాండ్ తరపున జేమ్స్ విన్సీ 13 టెస్టులు.. 25 వన్డేలు.. 17 టీ20 లు ఆడాడు.