శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (148 బంతుల్లో 111) సెంచరీతో చెలరేగాడు. కెరీర్ నాలుగో మ్యాచ్ లోనే సెంచరీ చేసి ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో తన పేరు మీద ఆల్ టైం రికార్డ్ లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన వికెట్ కీపర్‌గా స్మిత్ అన్నాడు.
24 సంవత్సరాల 42 రోజుల వయస్సులో స్మిత్ ఈ ఘనతను అందుకున్నాడు. అంతకముందు ఈ రికార్డ్ మాజీ వికెట్ కీపర్ లెస్ అమెస్ పేరిట ఉంది. అతను 24 సంవత్సరాల 63 రోజుల వయస్సులో తొలి టెస్ట్ సెంచరీ చేశాడు. ఈ సెంచరీ తర్వాత స్మిత్ ప్రస్తుత శ్రీలంక బ్యాటింగ్ కోచ్ ఇయాన్ బెల్ కు కృతజ్ఞతలు తెలిపాడు. బెల్ తనతో రెండు సంవత్సరాలు కలిసి పని చేసాడని.. లయన్స్, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌తో మ్యాచ్ లు ఆడేటప్పుడు అతని సలహాలు నాకు చాలా ఉపయోగపడ్డాయని స్మిత్ చెప్పాడు. అతను శ్రీలంక కోచ్ గా ఉన్నప్పటికీ అతనికి నేను కృతజ్ఞుడను. అని స్మిత్ చెప్పాడు.
ALSO READ | IPL 2025: రోహిత్ కోసం రూ.50 కోట్లు పక్కన పెట్టిన రెండు ఐపీఎల్ జట్లు
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. దీంతో లక్నక జట్టు 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మెండీస్ (56), చండీమల్ (20) క్రీజ్ లో ఉన్నారు. అంతకముందు శ్రీలంక 236 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో 122 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.