సీడబ్ల్యూసీ మీటింగ్ లో కాంగ్రెస్ ప్రకటన.. జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం

సీడబ్ల్యూసీ మీటింగ్ లో కాంగ్రెస్ ప్రకటన..  జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం

ఒకే దేశం.. ఒకే ఎన్నికల అంటూ రాజ్యాంగంపై కేంద్ర ప్రభుత్వం దాడిచేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ చిదంబరం. జమిలి ఎన్నికలంటే ప్రజాస్వామ్యంపై  దాడి చేయడమే.. జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు చిదంబరం. దేశంలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి.. వాటిని పక్క దారి పట్టించేందుకే జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు చిదంబరం.

బీజేపీ ఓడిపోయిన రాష్ట్రాలపై కక్ష్య సాధింపునకు దిగుతున్నారని.. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు చిదంబరం. ప్రధానికి విదేశాలకు వెళ్లే సమయం ఉంది కానీ.. మణిపూర్ పర్యటనకు సమయం దొరకడం లేదని కాంగ్రెస్ ఎంపీ చిదంబరం విమర్శించారు