
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు . ఉత్తర తెలంగాణలోనే రెండో పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గా పుల్లూరి స్వప్న, వైస్ చైర్మన్ ఎర్రంరెడ్డి సతీశ్‌రెడ్డి, డైరెక్టర్లుగా కామిడి శ్రీపతిరెడ్డి, నల్లగోని సతీశ్, మాదాసి సునీల్, నాయినేని రాజేశ్వరరావు, తాళ్లపల్లి శ్రీనివాస్, ఎగ్గేటి సదానందం, మనుపటి సురేశ్, గడ్డం దీక్షిత్, ఉప్పల శ్రీనివాస్ రెడ్డి, ఎండీ రషీద్ పాష, కందల తిరుపతి, దొడ్డ శ్యామ్ కుమార్, కటంగూరి శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్2 కార్యదర్శి రాజా, మార్కెట్ సిబ్బంది, కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏఎంసీ డైరెక్టర్‌గా గుమాస్తా ఎంపిక
కష్టపడ్డ వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందనేదానికి నిదర్శనం ఏఎంసీ డైరెక్టర్‌గా ఎంపికైన నాయినేని రాజేశ్వరరావు. జగ్గయ్యపల్లికి చెందిన రాజేశ్వరరావు 20 ఏండ్లుగా పార్టీ క్రియాశీలక సభ్యునిగా పనిచేస్తూ పట్టణంలోని ఓ బట్టల షాపులో గుమాస్తాగా పనిచేసేవారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పెద్దలు ఏఎంసీ డైరెక్టర్‌గా నియమించారు.