జమ్మికుంట మార్కెట్‌‌కు 4 రోజులు సెలవులు

జమ్మికుంట మార్కెట్‌‌కు 4 రోజులు సెలవులు

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌‌కు వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. ఈనెల 29న వారాంతపు యార్డు బంద్,30న ఉగాది, సాధారణ సెలవు, 31న రంజాన్, ఏప్రిల్ 1 రంజాన్ మరుసటి రోజు సెలవు ఉండనున్నట్లు పేర్కొన్నారు. 

తిరిగి మంగళవారం మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని, రైతులు సరుకు తీసుకురావద్దని కోరారు.