చావనైనా చస్తా కానీ లొంగిపోనన్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్. తాను పోలీసులను నమ్ముకున్న వాన్ని కాదని..ప్రజలను నమ్మకున్న వాడినన్నారు. నయీం లాంటి వాళ్లతో చంపిస్త అంటేనే.. తాను భయపడలేదన్నారు.జమ్మికుంటలో ముదిరాజ్ సంఘం సమావేశంలో పాల్గొన్నారు ఈటల. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ముదిరాజ్ లను కదిలిస్తే తేనెతెట్టెను కదిలించినట్టేనన్నారు. తాను గెలిస్తే ఆకలికేకలు లేని ఆత్మగౌరవ తెలంగాణ వస్తుందన్నారు. మాయమయ్యేది తాను కాదని..మీ కుటుంబం, మీ పార్టీ అంటూ హరీశ్ కు బదులిచ్చారు. 18 సంవత్సరాల కొట్లాట వేరు.. ఇప్పుడు కొట్లాట వేరన్నారు. అపుడు తెలంగాణ తల్లి విముక్తి కోసం కొట్లాడితే.. ఇప్పుడు కెసిఆర్ అన్యాయాల మీద, అక్రమాల మీద కొట్లాట అన్నారు. అప్పటి కెసిఆర్.. ఉద్యమాన్ని, ప్రజలను నమ్ముకుంటే.. ఇప్పుడు డబ్బు, మద్యం, అధికారాన్ని నమ్ముకున్నాడన్నారు ఈటల.
see more news
వరుణ్, మేనకా గాంధీలకు బీజేపీ షాక్
హెడ్మాస్టర్ ఇంట్లో ఫంక్షన్.. ఫుడ్ పాయిజనింగ్‌తో 100 మంది ఆస్పత్రిపాలు
హత్యలతో నిరసనలను అణచివేయలేరు: బీజేపీ ఎంపీ వార్నింగ్