మహారాష్ట్ర నుంచి అక్రమంగా నాటు సారా తరలింపు

మహారాష్ట్ర నుంచి అక్రమంగా నాటు సారా తరలింపు

కరీంనగర్ : జమ్మికుంట ఇంటెలిజెన్స్ పోలీసులు గుడుంబా తయారీదారుల గుట్టు రట్టు చేశారు. గుడుంబా తయారీకి ఉపయోగించే నల్ల బెల్లం, పటికతో పాటు నాటుసారాను అక్రమంగా రవాణా చేస్తుండగా నిందితులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు యువతుల సహాయంతో అక్కడి నుంచి నల్ల బెల్లం, పటిక దిగుమతి చేసుకుంటున్న గుడుంబా తయారీదారులను పట్టుకున్నారు.

నిందితుల నుంచి 350 కిలోలు పటిక, 250 కిలోల బెల్లం, 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. పటిక బెల్లాన్ని ఎవరు తెప్పించుకుంటున్నారనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.