జమ్మికుంట మున్సిపాలిటీలో ఇయ్యాలే అవిశ్వాస సమావేశం 

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ భవిష్యత్​ నేడు తేలనుంది. చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పై అవిశ్వాసం ప్రకటిస్తూ గత నెల 29న 21 మంది కౌన్సిలర్లు డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోకు తీర్మాన పత్రం అందజేశారు.  మరుసటి రోజు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి చైర్మన్​రాజేశ్వరరావు 20 మంది కౌన్సిలర్ల మద్దతు తనకే ఉందంటూ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం కౌన్సిలర్లను హైదరాబాద్​ క్యాంపునకు తరలించారు.

ఈక్రమంలో 25న కౌన్సిల్​సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్​పమేలా సత్పతి గతంలోనే కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం చైర్మన్ రాజేశ్వరరావుకు మద్దతుగా 14 మంది కౌన్సిలర్లు ఉండగా, ఎన్నికల టైంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరిన పొన్నగంటి మల్లయ్యకు 16 మంది కౌన్సిలర్ల మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. అవిశ్వాస సమావేశానికి 20 మంది హాజరు తప్పనిసరి కావడంతో సర్వత్రా ఆసక్తి కొనసాగుతుంది. ఈక్రమంలో రాజేశ్వరరావు వర్గంలోని 14 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే సమావేశం వాయిదా వేసి మరోసారి నిర్వహించాలని మల్లయ్య అధికారులను కోరినట్లు తెలుస్తోంది.  26 రోజులుగా క్యాంపు రాజకీయాలు నడుస్తుండగా నేడు చైర్మన్​భవితవ్యం తేలనుంది.  

బీఆర్ఎస్​ కౌన్సిలర్లకు విప్​జారీ 

నేడు అవిశ్వాస సమావేశం జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్​  కౌన్సిలర్లకు ఎమ్మెల్యే కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి విప్​జారీ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి విప్ కాపీలను అందజేశారు.