ఎగ్జిట్ పోల్స్ రిలీజ్.. కాంగ్రెస్ కూటమి వైపే జమ్మూ ఓటర్ల మొగ్గు

ఎగ్జిట్ పోల్స్ రిలీజ్..  కాంగ్రెస్ కూటమి వైపే జమ్మూ ఓటర్ల మొగ్గు

శ్రీనగర్: దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. జమ్మూ కాశ్మీర్‎లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగగా.. ఇవాళ (2024, అక్టోబర్ 5) చివరి దశ పోలింగ్ కంప్లీట్ అయ్యింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో సర్వే సంస్థలు, నేషనల్ మీడియా ఛానెల్స్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. జమ్మూ కాశ్మీర్ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారనే అంచనాలను వెల్లడించాయి. 

మెజార్టీ సర్వే సంస్థలు జమ్మూలో ఏ పార్టీకి అధికారం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజార్టీ రాదని.. హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ అలయెన్స్ మెజార్టీ సీట్లు సాధిస్తాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. బీజేపీకి కానీ, కాంగ్రెస్ కూటమి గానీ జమ్మూ కాశ్మీర్‎లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 46 సీట్ల మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేవని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. దీంతో జమ్మూలో ఏ పార్టీ జెండా రెపరెపలాడుతుందో తెలియాలంటే ఫలితాల తేదీ అక్టోబర్ 8 వరకు వెయిట్ చేయాల్సిందే మరీ. 

జమ్మూ కాశ్మీర్‌ (90) ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌:

  • పీపుల్ పల్స్ సర్వే: బీజేపీ 23 నుండి 27 సీట్లు, కాంగ్రెస్, ఎన్సీ కూటమి 46 నుండి 50 సీట్లు, పీడీపీ 6 నుండి 12 సీట్లు, ఇతరులు 4 నుండి 6 సీట్లు
  • దైనిక్‌ భాస్కర్‌ సర్వే: బీజేపీ 20- నుండి 25 స్థానాలు, కాంగ్రెస్‌, ఎన్సీ -అలయెన్స్ 35- నుండి 40 సీట్లు, పీడీపీ 4 నుండి -7 స్థానాలు, ఇతరులు 12 నుండి-16 సీట్లు
  • ఇండియా టూడే సీ ఓటర్ సర్వే్: బీజేపీ 27 నుండి 32 స్థానాలు, కాంగ్రెస్, ఎన్సీ కూటమి 40 నుండి 48 సీట్లు, పీడీపీ 6 నుండి 12 స్థానాలు, ఇతరులు 6 నుండి 11 సీట్లు
  •  రిపబ్లిక్‌ మ్యాట్రిక్‌: పీడీపీ 28, బీజేపీ 25, కాంగ్రెస్‌ 12, ఎన్సీ 15