జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. నామినేషన్ వేసిన ఒమర్ అబ్దుల్లా

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బుధవారం(సెప్టెంబర్ 04) గందేర్బల్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ సీనియర్ నేతలు, కుమారులతో కలిసి మినీ సెక్రటేరియట్‌కు చేరుకున్న ఒమర్ అబ్దుల్లా రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన మరో స్థానం బుద్గాం నుంచి కూడా పోటీ చేయవచ్చని నివేదికలు వస్తున్నాయి. 

మూడు దశల్లో ఎన్నికలు

90 మంది సభ్యులు గల జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్ 8న ఫలితాలు వెలుబడనున్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీకి ఇవే మొదటి ఎన్నికలు.

ALSO READ | నేటి నుంచి కాశ్మీర్​లో...రాహుల్ ఎన్నికల ప్రచారం