జమ్ముకాశ్మీర్లో ముగిసిన లాస్ట్ ఫేజ్ ఎన్నికలు.. 65.58 శాతం పోలింగ్ నమోదు

జమ్ముకాశ్మీర్లో ముగిసిన లాస్ట్ ఫేజ్ ఎన్నికలు.. 65.58 శాతం పోలింగ్ నమోదు

జమ్మూకాశ్మీర్ లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.  అక్టోబర్ 1న సాయంత్రం5  గంటల వరకు రికార్డ్ స్థాయిలో 65.58శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఉధంపూర్ జిల్లాలో 72.91శాతం ఓటింగ్ జరిగింది. సాంబలో 72.41, కథువాలో 70.53, జమ్ములో 66.79శాతం పోలింగ్ నమోదైంది. అలాగే బందిపొరాలో 63.33 శాతం, కుప్వారాలో 62.76శాతం నమోదు అయింది. అత్యల్పంగా బారాముల్లా జిల్లాలో 55.73శాతం పోలింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.  

ALSO READ | రాహుల్​ ఎన్నికల గ్యారంటీలన్నీ కోతలే : అమిత్​షా

జమ్మూకాశ్మీర్ లో థర్డ్ ఫేజ్ లో భాగంగా 40 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. వీటిలో జమ్మూ డివిజన్ లో 24స్థానాలు, కాశ్మీర్ లోయలో 16సెగ్మెంట్లలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. భారీ భద్రతను ఏర్పాటు చేసింది ఈసీ. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370రద్దు తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఫస్ట్, సెకండ్ ఫేజ్ పోలింగ్ లోనూ 50శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. దీంతో ఓటర్లు తీర్పు ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడించనుంది ఈసీ.