కశ్మీర్‌లో బాంబ్ బ్లాస్ట్

కశ్మీర్‌లో బాంబ్ బ్లాస్ట్

శ్రీనగర్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ పర్యటన ముగిసిందో లేదో అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బందిపోరాలో మంగళవారం చోటు చేసుకున్న ఈ గ్రెనేడ్ దాడిలో పలువురు పౌరులు గాయాల బారిన పడ్డారని సమాచారం. బందిపొరాలోని సంబల్ బ్రిడ్జి ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారని.. ఈ ఘటనలో పలువురు ప్రజలకు గాయాలయ్యాయని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నామని.. వారు ఏ సంస్థకు చెందిన వారో సమాచారం అందలేదన్నారు. గాయాలపాలైన పౌరులను ఆస్పత్రిలో చేర్చామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

కాగా, కశ్మీర్‌ లోయలో టెర్రరిస్టులు గత కొన్ని వారాల నుంచి సాధారణ పౌరులను టార్గెట్‌గా చేసుకుని చంపుతున్న నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఆసక్తిని సంతరించుకుంది. కశ్మీర్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులు, సిక్కులు, వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన దాడుల్లో ఇప్పటివరకు 11 మంది వరకు చనిపోయారు. వివాదాస్పద ఆర్టికల్ 370 రద్దు తర్వాత షా కశ్మీర్‌కు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

మరిన్ని వార్తల కోసం: 

టీకా వేసుకోకపోతే రేషన్, పెన్షన్ బంద్

బైపోల్ తర్వాత కేసీఆర్ నేలకు దిగుతడు: ఈటల

ఈ అమ్మాయి బుల్లెట్ బండిని​ రిపేర్​ చేస్తుంది