జమ్మూ/కథువా: జమ్మూకాశ్మీర్‌లో ఒక హెడ్ కానిస్టేబుల్ తన సహోద్యోగిని ఏకే-47 రైఫిల్‌తో కాల్చి చంపేశాడు. ఆపై సూసైడ్ చేసుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఉధంపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సెలెక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్సోపోర్ నుంచి రియాసి జిల్లాలోని సబ్సిడరీ ట్రైనింగ్ సెంటర్ (ఎస్‌టీసీ) తల్వారాకు బయలుదేరారు. మార్గమధ్యలో డ్రైవర్ తో గొడవపడిన హెడ్ కానిస్టేబుల్ కోపం పట్టలేక తన రైఫిల్‌తో కాల్పులు జరిపాడు.
ఆపై తనను తాను కాల్చుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు వ్యాన్‌లోని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాఫ్తులో హెడ్ కానిస్టేబుల్, డ్రైవర్ల మధ్య గొడవ జరిగినట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు. ప్రాణాలతో బయడపడిన సెలెక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్‌ను ప్రశ్నిస్తున్నామని వివరించారు.
కథువాలో సెర్చ్ ఆపరేషన్
జమ్మూలో టెర్రరిస్టుల అనుమానాస్పద కదలికల నేపథ్యంలో అధికారులు సెర్చ్ ఆపరేషన్ లాంచ్ చేశారు. ఆర్మీ, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇతర సంస్థల సహకారంతో జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఎరియల్ సర్వే నిర్వహిస్తున్నారు.