జమ్మూకాశ్మీర్ బ్యూటీతో సిరాజ్ రూమార్స్ ఎందుకు..? : క్రికెటర్ రియాక్షన్ ఏంటీ..?

జమ్మూకాశ్మీర్ బ్యూటీతో సిరాజ్ రూమార్స్ ఎందుకు..? : క్రికెటర్ రియాక్షన్ ఏంటీ..?

ఇటీవలే జరిగిన  ఐపీయల్ మెగా ఆక్షన్ 2025 లో భారత్ ప్రముఖ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ని గుజరాత్ టైటాన్స్ దాదాపుగా రూ.12.25 కోట్లు వెచ్చించి రికార్డు ధరకి కొనుగోలు చేసింది. ఈ వేలంలో భారత్ ఫాస్ట్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ కి అత్యధిక ధర దక్కిందని చెప్పవచ్చు. దీంతో ఒక్కసారిగా మహమ్మద్ సిరాజ్ వార్తల్లో నిలిచాడు. అయితే తాజాగా సిరాజ్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మహీరా శర్మతో సిరాజ్ ప్రేమాయణం రూమర్స్:

గత కొన్నేళ్లుగా సిరాజ్ జమ్మూ కాశ్మీర్ కి చెందిన నటి మహీరా శర్మతో ప్రేమాయణం నడుపుతున్నట్లు పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి. దీనికితోడు ఇటీవలే మహీరా శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలని సిరాజ్ లైక్ చెయ్యడంతో ఈ వార్తలు మరింత బలమయ్యాయి.

ALSO READ | దేవిశ్రీ, మైత్రి మేకర్స్ గొడవ: ఫైనల్గా క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత రవిశంకర్

కానీ ఇప్పటివరకూ సిరాజ్ మహీరా శర్మ ప్రేమలో ఉన్నట్లు వినిపిస్తున్న వార్తలపై ఈ ఇద్దరూ స్పందించకపోవడంతో ఈ వార్తలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. దీంతో కొందరు సిరాజ్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ ని లైక్ చేసినంతమాత్రాన ప్రేమలో ఉన్నట్లు కాదని కాబట్టి నిజం తెలుసుకోకుండా ఇలాంటి ప్రచారాలు చెయ్యడం సరికాదని అంటున్నారు.

సిరాజ్ ఎంగేజ్మెంట్:

ఈ విషయం ఇలా ఉండగా మహమ్మద్ సిరాజ్ 2021లో తనకి కాబోయే భార్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ పలు వ్యక్తిగత కారణాలవల్ల తనకి కాబోయే భార్య ఎవరనేది సీక్రెట్ గా ఉంచాడు ఇప్పటివరకూ. అయితే 2020 లో కరోనా కారణంగా తన తండ్రి మహమ్మద్ గౌస్ మానించిన సమయంలో తనకి కాబోయే భార్య అండగా నిలిచిందని, తన తల్లికి తోడుగా ఉంటూ ధైర్యం చెప్పిందని తెలిపాడు. ఒకరకంగా చెప్పాలంటే తనకి కాబోయే భార్య వల్లే మళ్ళీ ఆటపై దృష్టి సారించి సక్సస్ అయ్యానని అందుకే ఆమెని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు గతంలో చెప్పుకొచ్చాడు.

మహీరా శర్మ కెరీర్: 

ఇక మహీరా శర్మ విషయానికొస్తే జమ్మూ కాశ్మీర్ లో పలు టెలివిజన్ చానల్స్ నటించి బాగానే పాపులర్ అయ్యింది. అలాగే హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ఆకట్టుకుంది. అయితే బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు పరస్ చాబ్రా అనే నటుడితో ప్రేమలో పడింది. అంతేగాకుండా దాదాపుగా 4ఏళ్ళపాటూ డేటింగ్ లో ఉన్నారని, కానీ గత ఏడాది ఈ ఇద్దరికీ బ్రేకప్ అయ్యిందని పలు వార్తలు బలంగా వినిపించాయి.