జమ్మూకాశ్వీర్లో రెండో విడత పోలింగ్.. 9గంటల వరకు10.22 శాతం పోలింగ్

జమ్మూకాశ్వీర్లో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో 6జిల్లాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. బుధవారం(సెప్టెంబర్ 25, 2024) ఉదయం 9గంటల వరకు 10.22 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. పూంచ్, రియాసి తోపాటు రాజౌరి వంటి కీలక నియోజకవర్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారు. 

జమ్మూకాశ్వీర్ లో రెండో విడత పోలింగ్ లో మొత్తం 2.5 మిలియన్లకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 239మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 10యేళ్లలో జమ్మూలో మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. రెండో దశ ఎన్నికల్లో బీజేపీ నేత రవీందర్ రౌనా , రాజౌరీలోని నౌషేరా నుంచిపోటీలో ఉన్నారు. కాంగ్రెస్ కు చెంది న అభ్యర్థుల్లో ఒకరైన నేషనల్ కాంగ్రెస్ కు చెందిన ఒమర అబ్ధుల్లా .. గందర్ బల్, బుద్గామ్ నియోజకవర్గాల్లోపోటీ చేస్తున్నారు. 

Also Read :- నిండుకుండలా జలాశయాలు.. ఎక్కడంటే ?

సెప్టెంబర్ 18,2024న జమ్మూకాశ్మీర్ లోని 7 జిల్లాల్లోని 24నియోజకవర్గాల్లో మొదటి దశ పోలింగ్ జరిగింది. తొలి దశ ఎన్నికల్లో 61.13 శాతం ఓటింగ్ నమోదైంది.అక్టోబర్ 1న తేదీన మూడో దశ పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న నిర్వహించనున్నారు.