Delhi Results 2025: మనం కొట్టుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయి: జమ్ము కాశ్మీర్​​ సీఎం ఒమర్​ అబ్దుల్లా..

Delhi Results 2025: మనం కొట్టుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయి: జమ్ము కాశ్మీర్​​ సీఎం ఒమర్​ అబ్దుల్లా..

ఢిల్లీ ఫలితాలపై  జమ్మూకాశ్మీర్​ సీఎం ఒమర్​ అబ్దుల్లా ట్విట్టర్​ లో స్పందించారు.ఇండియా కూటమిలోని పార్టీను ఉద్దేశించి మనం కొట్టుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయి.  ఇంకా కొట్టుకోండి .. ఇంకా దారుణంగా ఫలితాలుంటాయని ట్విట్టర్​ లో ఘాటుగా స్పందించారు. రామాయణం వీడియోను షేర్​ చేశారు. 

Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c

— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ఎన్నికల ఫలితాల  ట్రెండ్స్​పై ట్విట్టర్​ ఘాటుగా స్పందించారు. ఔర్ లాడో ఆపాస్ మైన్ అని ఆయన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.  ఒమర్​ అబ్దుల్లా ప్రాతినిథ్యం వహిస్తున్న నేషనల్​ కాన్ఫరెన్స్​ పార్టీ కూడా ఇండియాకూటమిలో ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో , ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశ రాజధానిలో యమునా నది పరిశుభ్రతతో పాటు మరికొన్ని విషయాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు