కుప్వారాలో బస్సు బోల్తా.. ఇద్దరు స్టూడెంట్లు మృతి

కుప్వారాలో బస్సు బోల్తా.. ఇద్దరు స్టూడెంట్లు మృతి
  • 21 మందికి గాయాలు 

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్​లోని కుప్వారా జిల్లాలో కాలేజీ బస్సు బోల్తాపడి ఇద్దరు స్టూడెంట్లు మృతిచెందారు. మరో 21 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం సోగమ్​కు చెందిన ప్రభుత్వం డిగ్రీ కాలేజీకి చెందిన 27 మంది స్టూడెంట్లు బస్సులో పిక్నిక్​కు బయల్దేదారు. అయితే కొద్ది దూరం వెళ్లాక హంద్వారాలోని వోడ్పోరా సమీపంలో వీరి బస్సు కంట్రోల్ తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో గాయపడిన స్టూడెంట్లను హంద్వారాలోని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడిన విద్యార్థులు ట్రీట్​మెంట్ తీసుకుంటు మృతిచెందారు. మృతుల్లో ఒక అమ్మాయి ఉంది.