జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. రెండ్రోజుల క్రితం శ్రీనగర్‌లోని ఓ పాపులర్ ఫార్మసీ ఓనర్ సహా ముగ్గురి ప్రాణాలు తీసిన ముష్కరులు.. ఇవాళ ఒక ప్రభుత్వ స్కూల్‌లో కాల్పులు జరిగి ఇద్దరు టీచర్లను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన గురువారం ఉదయం శ్రీనగర్‌లో జరిగింది.
గురువారం ఉదయం 11.15 గంటల సమయంలో శ్రీనగర్‌లోని ఈద్గా సంగం ఏరియాలోని గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్‌లోకి సడన్‌గా ఉగ్రవాదులు చొరబడ్డారు. స్కూల్‌లోకి రాగానే కనిపించిన ఇద్దరు టీచర్లపై కాల్పులు జరిపి, పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరినీ స్కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించారని డాక్టర్లు తెలపారని జమ్ము కశ్మీర్ పోలీసులు తెలిపారు. మృతులను స్కూల్ ప్రిన్సిపాల్ సుపిందర్ కౌర్ (44), మరో టీచర్ దీపక్ చంద్‌గా గుర్తించామన్నారు. వారిలో ప్రిన్సిపాల్ సిక్కు కాగా, దీపక్ చంద్ కశ్మీరీ పండిట్ అని పేర్కొన్నారు. ఈ ఘటన సమాచారం తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని గాలిస్తున్నారు. ముష్కరులను మట్టుబెట్టేందుకు రంగంలోకి దిగారు.
రెండ్రోజుల క్రితమే మంగళవారం శ్రీనగర్‌లోని ఇక్బాల్ పార్క్ ఏరియాలో ముగ్గురిని కిరాతకంగా చంపారు ఉగ్రవాదులు.ఆ ప్రాంతంలో ఎన్నో ఏండ్లుగా మెడికల్ షాపు నడుపుతున్న కశ్మీరీ పండిట్ మఖాన్ లాల్ బింద్రూ (68)ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. అదే ఏరియాలో టాక్సీ స్టాండ్ ప్రెసిడెంట్ అయిన మహ్మద్ షఫీ, స్ట్రీట్ ఫుడ్ వెండార్ వీరేంద్ర పాశ్వాన్‌లను పొట్టనబెట్టుకున్నారు.
Two teachers killed in a terrorist attack at a government school in the Iddgah Sangam area of Srinagar: Jammu and Kashmir Police
— ANI (@ANI) October 7, 2021