జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడి..ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడి..ఏపీ, తెలంగాణకు  చెందిన ముగ్గురు మృతి

జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 26 మంది చనిపోయారు. మంగళవారం పహల్గామ్ సమీపంలోని మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడే బైసారన్ పచ్చిక మైదానంలో టెర్రరిస్టులు రక్తపాతం సృష్టించారు. ఉగ్ర ముష్కరుల దాడిలో మృతిచెందిన వారిలో ఏపీ, తెలంగాణకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. 

తెలంగాణలో ఐబీ ఆఫీసర్ గాపనిచేస్తున్న మనీష్ రంజన్, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖకు చెందిన చంద్రమౌళి, నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ లు ఉగ్రవాదులు తుపాకీ తూటాలకు బలయ్యారు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడిలో మహారాష్ట్రకు చెందిన ఐదుగురు టూరిస్టులు మృతిచెందారని డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. వీరితోపాటు కర్ణాటకకు చెందిన వ్యాపారి కూడా టెర్రరిస్టుల కాల్పుల్లో చనిపోయారు.