
హనుమకొండ / గ్రేటర్ వరంగల్, వెలుగు: స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన తీసుకుంటామని స్టేట్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ జమునాదేవి, బిందుశ్రీ హెచ్చరించారు. హనుమకొండలోని పలు స్కానింగ్ సెంటర్లలో మంగళవారం వారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలు చట్టారీత్యా నేరమన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాలికల నిష్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, తనిఖీల రిపోర్టును కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కు అందజేస్తామని వివరించారు.