జనవరి 23 నుంచే జాన్​ పహాడ్​ ఉర్సు

జనవరి 23 నుంచే జాన్​ పహాడ్​ ఉర్సు

నేరేడుచర్ల(పాలకవీడు)వెలుగు: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి   3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు   దర్గాకు రంగులు వేసి లైట్లతో అలంకరించారు. ఎలక్ట్రిసిటీ ఆఫీసర్లు దర్గా ఆవరణలో నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల ఏర్పాట్లను పాలకవీడు తాహసిల్దార్ కమలాకర్, ఎంపీడీవో లక్ష్మి, ఎంపీవో వీరయ్య పర్యవేక్షిస్తున్నారు.

ఉర్సు ఉత్సవాలను పరిశీలించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

బుధవారం జాన్ పహాడ్ దర్గాలో జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉర్సు లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సిఐ చరమంద రాజు, స్థానిక ఎస్సై లక్ష్మి నరసయ్యతో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. జాన్ పహాడ్ దర్గాకు శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్న నేపథ్యంలో హెలిఫ్యాడ్ ను పరిశీలించారు.