మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం బయటపడింది. ఫీర్జాదిగూడలో గోల్డ్ కాయిన్ స్కీమ్ అంటూ కేటుగాళ్లు రూ. 10 కోట్లకు టోకరా వేశారు. జన జాగరణ సమితి ట్రస్ట్ పేరుతో రూ.లక్ష కడితే రూ.2.70 లక్షలు ఇస్తామంటూ జనాలను మోసగించినట్లు తెలుస్తోంది. కాగా ట్రస్ట్ శ్రీకాంత్ జిన్నా అనే యువకునికి చెందినదిగా గుర్తించారు బాధితులు.
ఈ వ్యక్తి గతంలోనూ ఉప్పల్ లో పల్లీకాయల మిషన్ల నుంచి నూనె తీసి అమ్మితే పెద్దఎత్తున లాభాలు వస్తాయని నమ్మించి బిచాణా ఎత్తేశాడు. ఈ క్రమంలోనే జన జాగరణ సమితి ట్రస్ట్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ఆఫీసులో ధర్నా చేశారు బాధితులు. తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి గురించి ఆరా తీస్తున్నారు.