కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని తుక్కుగూడ జన జాతర సభ వేదికనుంచి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పొన్నం అన్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ .. జిల్లాల బాట పట్టారని విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని కేసీఆర్ కు సూచించారు.
బీజేపీ.. బీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుందన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి పొన్నం కోరారు.