పేట సభ సక్సెస్​తో..కాంగ్రెస్​లో జోష్

పేట సభ సక్సెస్​తో..కాంగ్రెస్​లో జోష్
  • ఎమ్మెల్సీ బై పోల్​​కోడ్​ తెచ్చి స్కీములు అడ్డుకున్నారన్న సీఎం

నారాయణపేట, వెలుగు: రూ.500కే సిలిండర్​, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్​ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేసినట్లు ఇక్కడా అమలు చేయాల్సి ఉండే. కానీ కేంద్రం లోకల్​ బాడీస్​ ఎమ్మెల్సీ బై పోల్​ షెడ్యూల్​ తీసుకురావడంతో ఈ హామీలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అమలు కాలేదు. కావాలనే బీజేపీ కోడ్​ పెట్టి ఈ హామీలను అడ్డుకుంది. దీనిపై ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయి. 

కోడ్​ ముగిసిన వెంటనే ఉమ్మడి జిల్లాలో ఈ రెండు స్కీములను అమలు చేస్తాం’ అని సీఎం ఎనుముల రేవంత్​రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని స్టేడియంలో సోమవారం రాత్రి ‘జన జాతర’ సభను నిర్వహించారు. సభకు మహబూబ్​నగర్​ పార్లమెంట్​ పరిధిలోని నారాయణపేట, కొడంగల్, మక్తల్, మహబూబ్​నగర్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్​నగర్​ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, లీడర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఎన్నికల్లో సీరియస్​గా పని చేసిన వారికే వార్డు మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలుగా అవకాశాలు ఇస్తామని చెప్పడంతో అందరూ హర్షధ్వానాలతో స్వాగతించారు. 

సభ సందర్భంగా సీఎంను చూసేందుకు లక్ష మంది వరకు తరలి వచ్చారు. ఎండ దంచుతున్నా.. సాయంత్రం నాలుగు గంటల నుంచే ప్రజలు, కార్యకర్తలు గ్రౌండ్​లోకి చేరుకున్నారు. కొంత ఆలస్యమైనా సీఎం వచ్చేంత వరకు వెయిట్​ చేశారు. రేవంత్​రెడ్డి స్పీచ్​ను ఆసక్తిగా విన్నారు. సభకు భారీగా జనం తరలిరావడం, సీఎం మాట్లాడుతున్నంత సేపు ప్రజలు హర్షధ్వానాలు చేయడం పార్టీ నేతల్లో జోష్​ నింపింది.

అహంకారంతో నిండిన దొరసాని డీకే అరుణ..

బీజేపీ క్యాండిడేట్​ డీకే అరుణ బరాబర్ అహంకారంతో నిండిన దొరసానేనని మహబూబ్​నగర్​ కాంగ్రెస్​ ఎంపీ క్యాండిడేట్​ చల్లా వంశీచంద్​ రెడ్డి ఆరోపించారు. పార్టీలు మారుస్తూ, బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నారని విమర్శించారు. గద్వాల బంగ్లా రాజకీయాలు చేస్తూ, ముదిరాజ్​లపై వ్యతిరేకతను చూయించారన్నారు. తమ్ముడు, అల్లుడు గెలుపు కోసం సొంత పార్టీ వాళ్లని మోసం చేశారన్నారు. ఓట్ల కోసం మోసం చేస్తున్న డీకే అరుణ.. ఓ దొరసాని అని వంశీచంద్ రెడ్డి విమర్శించారు. జాతీయ ఉపాధ్యక్  పదవి కోసం మోడీ దగ్గరికి వెళ్లిన డీకే అరుణ.. ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం, నారాయణపేటలో సైనిక్ స్కూల్ కోసం, వికారాబాద్-కృష్ణా రైల్వే కోసం ఎప్పుడైనా అడిగారా అని ప్రశ్నించారు.

 తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి పేరు మీద ఉన్న సంగంబండ ప్రాజెక్టు కట్టిన తర్వాత అక్కడున్న నిర్వాసితులకు కాంగ్రెస్​ మంత్రిగా ఉండి పూర్తి పరిహారం కూడా ఇప్పించలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్, నారాయణపేట నియోజరవర్గాలను రెండు కండ్లుగా చూస్తున్నారని, త్వరలో నారాయణపేటలో టెక్స్​టైల్​ పార్క్  ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఢిల్లీలో అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరుకు కేసీఆర్  ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదన్నారు. కమీషన్ల కోసమే జీవో 69 అమలు చేయకుండా ‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు తీసుకువచ్చారన్నారు. 

గతంలో కాంగ్రెస్  ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 8 లక్షల ఎకరాలకే నీరు వస్తోందన్నారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్​కుమార్  మాట్లాడుతూ బీజేపీ మాదిగల వ్యతిరేకి అని విమర్శించారు. వర్గీకరణ చేస్తామని మందకృష్ణ మాదిగను లొంగదీసుకుని మోసం చేస్తోందన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మాట్లాడుతూ తనకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే వంశీచంద్​రెడ్డికి డబుల్ మెజార్టీ ఇచ్చి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. తన తాత ఆశయం మేరకు జయమ్మ చెరువుకు 69 జీవో ద్వారా నీళ్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.