కరీంనగర్ సిటీ, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో ఏబీవీపీ కీలక పాత్ర పోషించిందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జానారెడ్డి గుర్తుచేశారు. ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిటీలో ర్యాలీ చేశారు. స్వామి వివేకానంద చిత్రపటాలకు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 75 ఏళ్లుగా విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ పోరాటం చేస్తోందన్నారు.
ఢిల్లీలో ప్రారంభమైన పరిషత్ నేడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 50 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘంగా ఉందన్నారు. కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ కోడి అజయ్, జిల్లా ప్రముఖ్ రాచకొండ గిరిబాబు, జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి బామాండ్ల నందు, రాష్ట్ర కార్యాసమితి సభ్యుడు అంజన్న, స్టేట్ లా ఫోరమ్ కో -కన్వీనర్ ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.