
కాశీబుగ్గ/కాజీపేట/ జనగామ అర్బన్, వెలుగు: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, వరంగల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డివిజనల్ మేనేజర్ ప్రఖార్ వర్మ అన్నారు. సోమవారం జనగామ కలెక్టరేట్ లో, కాజీపేట ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్ నిర్వహించారు.
జనగామలో స్క్రీనింగ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కళ్లద్దాలు అందజేశారు. మహిళా శానిటేషన్ సిబ్బందిని, మున్సిపల్ మహిళా పారిశుధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి, వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులను ప్రశంసాపత్రాలతోపాటు బహుమతులు అందజేశారు. కార్యక్రమాల్లో జనగామ అడిషనల్ కలెక్టర్లు పింకేశ్కుమార్, రోహిత్ సింగ్, జడ్పీసీఈవో మాధురీ షా, కాజీపేటలో ఏజేఎం కే.ఇందు తదితరులు పాల్గొన్నారు.