కలెక్టర్ సీరియస్.. జనగామ కలెక్టరేట్‎లో 25 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

కలెక్టర్ సీరియస్.. జనగామ కలెక్టరేట్‎లో 25 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

జనగామ, వెలుగు: టైమ్‎కు డ్యూటీకి రాని ఉద్యోగులపై జనగామ కలెక్టర్ రిజ్వాన్​బాషా షేక్​కొరడా ఝుళిపించారు. విధుల్లో లేని 25 మందికి షోకాజ్​నోటీసులు​జారీ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‎లోని వివిధ విభాగాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొంతకాలంగా జిల్లాస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది డ్యూటీలకు సరిగా రావడం లేదనే ఆరోపణలు వస్తుండగా కలెక్టర్​స్పందించారు. దీంతో డుమ్మా కొట్టే, సమయానికి రాని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కలెక్టర్​సీరియస్​అయ్యారు. 

కలెక్టరేట్‎లోని ప్రతి  విభాగానికి వెళ్లి అటెండెన్స్ రిజిస్టర్లను చెక్ చేశారు. పేర్లను చదువుతూ.. వచ్చారా..? లేదా..? అని అడిగారు. మొత్తం ఎంత మంది సిబ్బంది..? ఆఫీస్‎కు రానివారు ఎంతమంది అంటూ ఆరా తీశారు. గైర్హాజరైన 25 మంది ఉద్యోగులకు షోకాజ్​నోటీసులు ఇవ్వాలని కలెక్టరేట్​ఏవో మన్సూర్‎ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్​మాట్లాడుతూ.. ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. మూవ్​మెంట్​రిజిస్టర్​నిర్వహించాలని సూచించారు.