ఒక్క ఛాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వండి : కడియం శ్రీహరి

స్టేషన్‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఒక్క ఛాన్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్సీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ కడియం శ్రీహరి చెప్పారు. జనగామ జిల్లా స్టేషన్‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ మండలం చంద్రుతండా, కోమటిగూడెం, రంగరాయగూడెం, సముద్రాల, ఇప్పగూడెం, అక్కపల్లిగూడెం గ్రామాల్లో గురువారం  ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పాలన కారణంగానే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

సముద్రాల, కోమటిగూడెం, బోయినిగూడెం, ఇప్పగూడెం, అక్కపల్లిగూడెం గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్​, బీజేపీ లీడర్లను నిలదీయాలని సూచించారు. రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లర్స్‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెలిదె వెంకన్న, సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల ఫోరం మండల అధ్యక్షుడు పోగుల సారంగపాణి, ఏఎంసీ వైస్‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌ చల్లా చందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నాయకులు నగరబోయిన యాదగిరి, తోట వెంకన్న, తాటికొండ కుమారస్వామి పాల్గొన్నారు.