తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా కేంద్రంలో సంచలన ఘటన జరిగింది. జనగామ పట్టణంలోని వెంకన్నకుంటలోని.. తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయారు ఎస్సై శ్రీనివాస్. ఇతను జనగామ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పని చేస్తున్నారు. ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్యకు ముందు.. అతని భార్య స్వరూప ఇంట్లోని బాత్రూంలో ఉరి వేసుకుని చనిపోయింది. వరసగా జరిగిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల వల్లే వీళ్లిద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్థారించారు పోలీసులు.
ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్యకు ముందు ఇంట్లో గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. కుటుంబ కలహాల క్రమంలో.. ఏప్రిల్ 6వ తేదీ గురువారం తెల్లవారుజామున అతని భార్య స్వరూప బాత్రూంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన ఎస్సై శ్రీనివాస్.. తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భార్య ఆత్మహత్య తర్వాత.. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు.