సీఎంఆర్‌‌ టార్గెట్‌‌ను చేరుకోవాలి : కలెక్టర్‌‌ సీహెచ్‌‌.శివలింగయ్య

జనగామ అర్బన్, వెలుగు : వానాకాలానికి సంబంధించిన సీఎంఆర్‌‌ టార్గెట్‌‌ను చేరుకోవాలని జనగామ కలెక్టర్‌‌ సీహెచ్‌‌.శివలింగయ్య ఆదేశించారు. అడిషనల్‌‌ కలెక్టర్లు పర్మర్‌‌ పింకేశ్‌‌ కుమార్‌‌, సుహాసినితో కలిసి శుక్రవారం మిల్లర్లు, సంబంధిత ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 – -23 వానాకాలానికి సంబంధించి

1,11,932 టన్నుల రైస్‌‌ అందిందని, మిగిలిన 3,600 టన్నులను వెంటనే ఇవ్వాలని చెప్పారు. మిల్లర్లు ఏరోజుకారోజు టార్గెట్‌‌ను పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో డీసీఎస్‌‌వో రోజారాణి, సివిల్‌‌ సప్లై డీఎం ప్రసాద్, బెలిదె వెంకన్న, పజ్జూరి జయహరి, రాం, శ్రీధర్, శ్రీనివాస్, దేవ పాల్గొన్నారు.