
జనగామ అర్బన్, వెలుగు: టెన్త్ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ పింకేశ్‌కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి ఎగ్జామ్స్నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పది పరీక్షలకు 41 సెంటర్లలో 6238 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అంతకుముందు కలెక్టరేట్లో అలీంకో సంస్థ సహకారంతో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 66 మంది దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. అనంతరం జనగామ మండల పరిధిలోని మరిగడి ఎంపీపీఎస్ స్కూల్‌ను కలెక్టర్ ఆకస్మకంగా సందర్శించారు. ఏఐ ఎడ్యుకేషన్‌ను పరిశీలించి ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.