రఘునాథపల్లి, వెలుగు: జూన్ మొదటి వారంలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లలో వేగవంతం చేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఆశ్వారావుపల్లి, వెల్ది గ్రామాల్లోని ఐకేపీ, పీఏసీఎస్ ల ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 24,559 మంది రైతుల నుంచి లక్షా 25వేలకుపైగా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, 23,413 రైతులకు రూ.256.18 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఆయన వెంట డీఈవో రాము, డీసీఎస్వో రోజా రాణి, డీఆర్డీవో మొగులప్ప, డీఎం సీఎస్ ప్రసాద్, డీటీ సీఎస్ శ్రీనివాస్,ఎమ్మార్వో యుగంధర్ తదితరులు ఉన్నారు.