జనగామ అర్బన్, వెలుగు: కొత్త పంచాయతీలు ఏర్పడిన నేపథ్యంలో గ్రామాల వారీగా ఓటర్ల నివేదిక రూపొందించేందుకు పక్కా ప్రణాళిక అవసరమని జనగామ కలెక్టర్రిజ్వాన్బాషా షేక్ తెలిపారు. కలెక్టరేట్ లో ఓటర్ జాబితా రూపకల్పనపై అడిషనల్కలెక్టర్ పింకేశ్కుమార్ తో కలిసి సంబంధిత రెవెన్యూ, పంచాయతీ అధికారులతో గురువారం మీటింగ్ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా మాస్టర్ ట్రైనీలకు పీపీటీ ద్వారా అవగాహన కల్పించారు.
వార్డుల వారీగా బీఎల్వోలతో పంచాయతీ సెక్రటరీలు ఓటరు జాబితా తయారు చేయాలన్నారు. మరోవైపు, ఎల్ఆర్ఎస్దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్కాన్ఫరెన్స్హాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల అనుమతులపై సంబంధిత అధికారులతో గురువారం రివ్యూ నిర్వహించారు. దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు శిక్షణ ఇస్తామన్నారు.