జనగామ అర్బన్, వెలుగు : పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జనగామ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేయాలని జనగామ కలెక్టర్ షేక్రిజ్వాన్బాషా అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల హెచ్ఎం లకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లోని కాన్పరెన్స్ హాల్లో ఒరియేంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షల్లో స్టూడెంట్లు వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విజయోస్తు కార్యక్రమం రూపకల్పన చేశామన్నారు. ఆ దిశగా హెచ్‌ఎంలు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ కే. రాము, కె. రవికుమార్, జి. చంద్రభాను, టి. రాజు, బి. శ్రీనివాస్, గౌసియా, ఎం. రామరాజు, అన్ని మండలాల ఎంఈవోలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.