
జనగామ అర్బన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటవెంటనే పరిష్కరించాలని జనగామ కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 71 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులకు సూచనలు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు మధుమోహన్, కృష్ణవేణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధిక, డీఆర్డీవో పీడీ రాంరెడ్డి, డీఎంహెచ్‌వో మహేందర్, జడ్పీ సీఈవో వసంత పాల్గొన్నారు.
ములుగులో 33 అర్జీలు
ములుగు, వెలుగు: ములుగు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అడిషనల్ కలెక్టర్లు త్రిపాఠి, వైవీ.గణేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి భూ సంబంధ అర్జీలు 14, మిగతా డిపార్ట్‌మెంట్లకు సంబంధించి 19 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి ఫిర్యాదుదారులకు అప్‌డేట్ ఇవ్వాలని, వారిని ఆఫీస్‌ల చుట్టూ తిప్పుకోవద్దని ఆదేశించారు. ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. కంటి వెలుగును సక్సెస్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌వో రమాదేవి, డీఆర్డీవో నాగపద్మజ పాల్గొన్నారు.
హనుమకొండలో...
హనుమకొండ సిటీ, వెలుగు : హనుమకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తాపట్నాయక్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌వో వాసుచంద్ర కలిసి సోమవారం ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. మొత్తం 96 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో కిరణ్, ప్రకాశ్, డీపీవో జగదీశ్వర్, డీఎంహెచ్‌వో సాంబశివరావు పాల్గొన్నారు.
బల్దియాలో పెరుగుతున్న ఫిర్యాదులు
వరంగల్‌సిటీ, వెలుగు: బల్దియా ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రధానంగా టౌన్ ప్లానింగ్‌పైనే ఎక్కువ ఫిర్యాదులు అందాయి. మొత్తం 82 ఫిర్యాదులు రాగా ఇందులో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 14, టౌన్ ప్లానింగ్ 39 , పన్నుల విభాగం 14, ప్రజారోగ్యం, శానిటేషన్ 10, నీటి సరఫరా విభాగానికి సంబంధించి 5 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రవీందర్ యాదవ్, డిప్యూటీ కమిషనర్లు అనిసుర్ రషీద్, శ్రీనివాస్‌రెడ్డి, జోనా, ఎస్‌ఈలు కృష్ణారావు, ప్రవీణ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.