అడ్డదారిలో గెలిచిన పల్లా : కొమ్మూరి ప్రతాప్‌‌రెడ్డి

బచ్చన్నపేట, వెలుగు : జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి అడ్డదారిలో అధికారంలోకి వచ్చారని జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌‌రెడ్డి విమర్శించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట హాస్పిటల్‌‌ వద్ద ఆదివారం ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి కార్యక్రమాలను ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. ఉచిత బస్సు సౌకర్యంతో అన్ని వర్గాల మహిళలు ఆనందంగా ఉన్నారన్నారు. ఇంకా అధికారంలోనే ఉన్నామన్న భ్రమలోంచి బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు బయటకు రావాలని సూచించారు. పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి డబ్బులు వెదజల్లి, దొంగ ఓట్లు సృష్టించి గెలిచారని ఆరోపించారు.

బీఆర్‌‌ఎస్‌‌లో అసంతృప్తిగా ఉన్న ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌‌లు గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్​లో చేరాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట ఆర్డీవో మురళీకృష్ణ, అగ్రికల్చర్‌‌ ఆఫీసర్‌‌ వినోద్‌‌కుమార్‌‌, తహసీల్దార్‌‌ విశాలక్షి, ఎంపీడీవో రఘురామకృష్ణ, మెడికల్‌‌ ఆఫీసర్లు సిద్దారెడ్డి, శ్రీనివాస్‌‌, సుగుణాకర్‌‌రాజు ఉన్నారు.