వరంగల్ సదస్సును జయప్రదం చేయాలి : జనగామ డీసీసీ ప్రెసిడెంట్ ​కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి

వరంగల్ సదస్సును జయప్రదం చేయాలి : జనగామ డీసీసీ ప్రెసిడెంట్ ​కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి

జనగామ, వెలుగు: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్​రెడ్డి పాలన సాగిస్తున్నారని జనగామ డీసీసీ ప్రెసిడెంట్​ కొమ్మూరి ప్రతాప్​రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్ లో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. యేడాది ప్రజాపాలనపై ఈ నెల 19న హనుకొండ ఆర్ట్స్ అండ్ సెన్స్ కాలేజీ ఆవరణలో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే మహిళా సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్న ఈ సదస్సుకు పార్టీకి చెందిన మహిళలతోపాటు, లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. జిల్లాలోని ప్రతి గ్రామం, పట్టణం నుంచి మొత్తంగా 20 వేల మందిని సదస్సుకు తరలించనున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు, ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్​దని అన్నారు.

సమసమాజ స్థాపన కోసం రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే జరుగుతుందన్నారు. సమావేశంలో మార్కెట్​కమిటీ చైర్మన్ బనుక శివరాజ్​యాదవ్, పీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్​రెడ్డి, బుచ్చిరెడ్డి, జమాల్​షరీఫ్, బడికె ఇందిర, డాక్టర్​ సీహెచ్​రాజమౌళి, డాక్టర్​లక్ష్మీనారాయణ నాయక్, బాలరాజు, నూకల బాల్​రెడ్డి, వంగాల కల్యాణీమల్లారెడ్డి, దుర్గేశ్, కట్ట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.