
జనగామ అర్బన్, వెలుగు : గుట్కాలు, పోగాకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ సీతారాంతో కలిసి ఆయన జాతీయ పోగాకు నియంత్రణ జిల్లా సమన్వయ కమిటీ తో రివ్యూ నిర్వహించారు. సిగరెట్లు, పొగాకు అమ్మకాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి పాఠశాల వద్ద, ప్రతి గ్రామ పంచాయతీలలో అవగాహన పోస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరైనా నిబంధనలనుఅతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ రివ్యూలో డీఎంహెచ్ఓ హారీశ్ రాజ్, డీఆర్డీఓ మొగులప్ప, జీఎం ఇండస్ట్రీస్ మేనేజర్ రమేశ్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుధీర్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.